Breaking News

'ఆ విషయం నాకు ముందే చెప్పారు'.. కల్కిపై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Fri, 06/28/2024 - 21:19

ప్రభాస్- నాగ్‌ అశ్విన్ కాంంబోలో‌ తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కల్కి 2898 ఏడీ. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నైజాంలో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిమిగమించేసింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు సాధించి ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ నమోదు చేసింది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌, అమితాబ్ బచ్చన్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా కమల్‌ హాసన్‌ కల్కి సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా సుప్రీం యాస్కిన్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'కల్కి రెండో పార్ట్‌లోనే నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నాకు ముందే చెప్పారు. కేవలం ఓ అభిమానిగా పార్ట్‌-1 షూటింగ్‌లో పాల్గొన్నా. ప్రస్తుతం ఇండియన్‌ సినిమా గ్లోబల్‌ స్థాయికి చేరుకుంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు ఓపిక చాలా ఎక్కువ. పురాణాలను సైన్స్‌ను ముడిపెట్టి కల్కిని అద్భుతంగా రూపొందించారు. చాలా ఓపిగ్గా కల్కి కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు' అంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో విలన్‌గా నటించిన సినిమాల కంటే యాస్కిన్‌ పాత్ర భిన్నంగా కనిపించిందన్నారు. ఈ పాత్ర నేను చేయగలనా అనే సందేహం వచ్చిందని కమల్ తెలిపారు. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)