Breaking News

మాజీ అల్లుడితో రజినీకాంత్.. ఆ దిగ్గజం బయోపిక్ కోసమే?

Published on Wed, 02/28/2024 - 08:05

సాధారణంగా స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే పెద్ద విషయమేం కాదు. కానీ ముగ్గురు ప్రముఖ హీరోలు ఒకే మూవీలో కలిసి నటిస్తే మాత్రం విశేషమని చెప్పొచ్చు. ఇలాంటిదే త్వరలో తమిళ చిత్రసీమలో జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని  తర్వాత దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో సినిమాలు చూసిన వాళ్లకు ఇళయరాజా పాటల్లోనే మ్యాజిక్ ఏంటనేది తెలుస్తుంది. దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలకు సంగీతమందించిన ఈయన.. దశాబ్దాల పాటు గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇప్పుడు ఈయన జీవితాన్నే సినిమాగా తీయబోతున్నారు. ఇందులోనే కమల్ హాసన్-రజినీకాంత్ అతిథి పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 

రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని గతంలో పెళ్లి చేసుకున్న ధనుష్.. కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చేశాడు. దీంతో రజినీకాంత్‌కి ఇతడు మాజీ అల్లుడు అయిపోయాడు. అయినా సరే ఇప్పుడు రజినీకాంత్.. ధనుష్ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. బహుశా ఇళయరాజా బయోపిక్ కావడం వల్లే ఒప్పుకొని ఉంటాడని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే)

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)