Breaking News

రోబో, 2.0 సినిమా ఆఫర్‌.. అందుకే వెనకడుగు వేశా!

Published on Mon, 07/01/2024 - 01:59

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌ హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబోలో 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రూపొందింది. లైకా ప్రోడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ మూవీ తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్‌ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌కి  సమయం దగ్గరపడటంతో జోరుగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ఐ–రోబో’ అనే ఇంగ్లిష్‌ నవలను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్, రచయిత సుజాత (ఎస్‌. రంగరాజన్ ) 90ల్లోనే అనుకున్నాం.

 నా పాత్ర లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది. కానీ, ఆప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇండస్ట్రీలో బడ్జెట్, పారితోషికం, డేట్స్, మార్కెట్‌.. ఇలా ఎన్నో లెక్కలు  ఉంటాయి. అప్పటి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగు వేశా. కానీ, నా స్నేహితుడు శంకర్‌ మాత్రం వదల్లేదు. సరైన సమయంలో రజనీకాంత్‌తో ‘రోబో’ సినిమా తీసి, బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు. అలాగే ‘2.0’ మూవీలో విలన్‌ పాత్ర కోసం నన్ను సంప్రదించారు శంకర్‌. అయితే కొన్నాళ్ల పాటు నేను హీరోగా ఉండాలనుకుంటున్నానంటూ నవ్వుతూ శంకర్‌కు చెప్పాను’’ అన్నారు కమల్‌ హాసన్‌. అయితే రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘2.0’ మూవీలో విలన్‌గా అక్షయ్‌ కుమార్‌ నటించారు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)