Breaking News

శివ కార్తికేయన్‌- వెంకట్‌ సినిమా.. ట్రెండింగ్‌ హీరోయిన్‌కు ఛాన్స్‌

Published on Wed, 11/05/2025 - 07:11

కోలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటుడు శివ కార్తికేయన్‌(Sivakarthikeyan ). అంతేకాకుండా ఇటీవల అయిలాన్, మావిరన్,అమరన్‌ వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన కథానాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్‌ ప్రతినాయకుడుగాను అధర్వ ముఖ్యపాత్రలోనూ నటిస్తుండగా, టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2026 జనవరిలో పొంగల్‌ రేస్‌కు సిద్ధమవుతోంది. 

దీంతో శివకార్తికేయన్‌ తర్వాత చిత్రానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం వెంకట్‌ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో నటించిన ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు వెంకట్‌ ప్రభు ఇంతకుముందు విజయ్‌ కథానాయకుడిగా నటించిన గోట్‌ చిత్రంలో శివ కార్తికేయన్‌ గౌరవ పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో రూపొందనున్న చిత్రం టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో సాగుతుందని సమాచారం.  శివ కార్తికేయన్‌ చివరి చిత్రం మదరాసి అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. అదే విధంగా వెంకట్‌ ప్రభు చిత్రం గోట్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ హిట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఇందులో శివకార్తికేయన్‌కు జంటగా కల్యాణి ప్రియదర్శన్‌(Kalyani Priyadarshan) నటించనున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల మలయాళంలో నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం 'కొత్త లోక' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కల్యాణి ప్రియదర్శన్‌ ఇంతకుముందే హీరో అనే చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించారన్నది గమనార్హం.  ఇప్పుడు ఈ జంట మళ్లీ  రిపీట్‌ కానున్నదన్నమాట.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)