Breaking News

ఆ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నా: యంగ్‌ హీరోయిన్

Published on Mon, 12/04/2023 - 16:45

ఇటీవలే ఆంటోనీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ భామ కల్యాణి ప్రియదర్శన్. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంతకు ముందు ఎప్పుడు కనిపించని  కిక్ బాక్సర్‌ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలన్నింటిలో తనదైన నటనతో ఆకట్టుకుంది. జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జోజు జార్జ్ హీరోగా నటించారు. 

దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా తాను నటించిన ఆంటోనీ చిత్రం గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్లు తెలిపింది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం

కల్యాణి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'కంఫర్ట్ జోన్‌లో గ్రోత్ లేదు. గ్రోత్ జోన్‌లో కంఫర్ట్ లేదు. నేను ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా తెలుసుకున్నా. కానీ ఆ పంచ్‌లు, కిక్‌లు, గాయాలు, కన్నీళ్లు, చిరునవ్వులు మాత్రమే నిజమయ్యాయి. కానీ ఆ రక్తం మాత్రం నిజం కాదు. మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కేరింతలకు ధన్యవాదాలు. అన్నింటికంటే మించి నాపై, నా సినిమాపై ప్రేమ చూపినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్‌ యూ అంటూ పోస్ట్ చేసింది. 

అయితే ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో గాయపడినట్లు కల్యాణి తెలిపింది. మూడు వారాలపాటు ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటలు కిక్ బాక్సింగ్ శిక్షణ ఉండేదని వివరించింది. అందుకోసం చాలా శిక్షణ కష్టపడ్డానని.. గాయాల కారణంగా రెండు రోజులు షూటింగ్‌ నుంచి విరామం తీసుకోవలసి వచ్చిందని వెల్లడించింది. అందుకే ఇతర నటీనటులకు కూడా డేట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని కల్యాణి తెలిపింది. కాగా.. ఆంటోనీ చిత్రంల నైల ఉష, చెంబన్ వినోద్, ఆశా శరత్, విజయరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం కల్యాణి ఫాతిమా ఆన్ మైక్ ‍అనే చిత్రంలో నటిస్తున్నారు. 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)