Breaking News

చిన్న సినిమా.. బిగ్‌ హిట్‌.. ఏకంగా మోహన్‌లాల్ మూవీ రికార్డ్ బ్రేక్!

Published on Sun, 09/21/2025 - 11:13

కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మలయాళ చిత్రం లోకా చాప్టర్-1 చంద్ర. ఈ మూవీని తెలుగులో కొత్త లోకా పేరుతో రిలీజ్ చేశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ వసూళ్లపరంగా అదరగొట్టేసింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. 

మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా లోకా చాప్టర్-1 చంద్ర నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ సినిమాను అధిగమించింది. కాగా..  ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మించింది. ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

ఈ మూవీ రిలీజైన 23 రోజుల్లో ఇండియాలో రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.266 కోట్లు కలెక్ట్ చేసింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్‌2 ఎంపురాన్ మనదేశంలో రూ.105 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.265.5 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో కొత్త లోకా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో మొదటి స్థానం దక్కించుకుంది. 


 

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు