Breaking News

నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్‌

Published on Mon, 07/28/2025 - 12:52

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Kalyani Priyadarshan) లేకపోయుంటే తాను ఏమైపోయేదాన్నో అంటోంది హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌. తనకు ఏ అవసరమొచ్చినా, ఎటువంటి సలహా కావాలన్నా ఎప్పుడూ అతడు అందుబాటులో ఉంటాడని చెప్తోంది. నేడు (జూలై 28) దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్యాణి సోషల్‌ మీడియాలో వేదికగా హీరోకు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ప్రియమైన D(దుల్కర్‌), ప్రతి ఏడాది నీకు సోషల్‌ మీడియాలో కాకుండా నేరుగా ఓ పెద్ద మెసేజ్‌ పంపుతాను.

నేనెప్పుడూ ఒంటరిదాన్ని కాను
కానీ ఈ సారి మన కలల ప్రపంచానికి సంబంధించిన (మూవీ) గ్లింప్స్‌ అందరితో​ షేర్‌ చేసుకోబోతున్నాం. అందుకే ఈ పోస్ట్‌.. నిజ జీవితంలో, సినీ ప్రపంచంలో నువ్వు కన్న ప్రతి కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఐదేళ్లుగా నాకు ఏ సలహా కావాలన్నా ఫస్ట్‌ ఫోన్‌ నీకే చేస్తాను. అంతలా నాకు సపోర్ట్‌గా నిలబడ్డందుకు థాంక్యూ. నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాదు అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

అప్పటినుంచే స్నేహం
దుల్కర్‌, కల్యాణి.. 2020లో వచ్చిన మలయాళ చిత్రం 'వరణే అవశ్యముంద్‌'లో జంటగా నటించారు. అప్పుడే వీరు క్లోజ్‌ ఫ్రెండ్సయ్యారు. అప్పటినుంచి వీరి స్నేహం అలాగే కొనసాగుతూనే ఉంది. నేడు దుల్కర్‌ బర్త్‌డే సందర్భంగా.. అతడు నిర్మాతగా వ్యవహరిస్తున్న లోక, చాప్టర్‌ 1: చంద్ర సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)