డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చా, ఆ భయం లేదు: ప్రియా భవానీ శంకర్‌

Published on Thu, 01/19/2023 - 09:37

డబ్బు సంపాదించడం కోసమే నటించడానికి వచ్చానని నటి ప్రియా భవానీ శంకర్‌ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. ఆమె బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన సంగతి తెలిసిందే. మేయాదమానే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాభవానీశంకర్‌ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎస్‌జే.సూర్య సరసన మాన్‌స్టర్, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, అరుణ్‌విజయ్‌తో మాఫియా,ధనుష్‌తో తిరుచ్చిట్రంఫలం వంటి చిత్రాల్లో నటించి ప్రాచుర్యం పొందింది.

ప్రస్తుతం రుద్రన్, డిమాంటీ కాలనీ- 2, ఇండియన్‌-2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన కల్యాణం.. కమనీయం అనే తెలుగు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న తెరపైకి వచ్చింది. మరో తెలుగు చిత్రం కూడా చేస్తోంది. ఈ సందర్భంగా ప్రియాభవానిశంకర్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సహజత్వంతో కూడిన కథా చిత్రాలంటే తనకు ఇష్టం అని చెప్పింది. ఇటీవల తమిళంలో ధనుష్‌కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటించానని చెప్పారు.

నటించడానికి వచ్చినప్పుడు భవిష్యత్‌ గురించి ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పింది. ప్రేక్షకులు తనను ఆదరిస్తారా, లేదా అని భయపడలేదని చెప్పింది. నటిస్తే డబ్బు వస్తుంది అనే భావించానని, అందుకే నటించడానికి వచ్చానని పేర్కొంది. ఇటీవలే  తెలుగులోనూ నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. సినీ నేపథ్యం కలిగిన వారే తామేంటో నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారని, దీంతో తాను ఇంకా ఎక్కువగా శ్రమించాలని భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ప్రియాభవానీశంకర్‌ పేర్కొంది.  

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)