Breaking News

ప్రపంచ వేదికపై తెలుగు సినిమా.. ఆ దేశ భాషలోనూ కల్కి రిలీజ్‌!

Published on Wed, 08/28/2024 - 11:06

టాలీవుడ్‌ సినిమా పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా నుంచి పాన్‌ వరల్డ్‌ దాకా ఎదిగింది. తాజాగా రష్యాలోని మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ వీక్‌లో ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాలను ప్రదర్శించారు. రష్యాలోనూ ఇండియన్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆర్ఆర్ఆర్‌ను ఆ దేశ భాషలోనూ విడుదల చేశారు.

రష్యన్‌ భాషలో రిలీజ్‌

తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాను రష్యన్‌ భాషలోనూ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వప్నదత్‌, ప్రియాంక దత్‌లు వెల్లడించారు. కల్కి సినిమాను రష్యా భాషలోకి డబ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌లోనే రష్యా థియేటర్లలో కల్కి సందడి చేయనుంది. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌లో టాలీవుడ్‌ సినిమాల ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆగస్టు 23న ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ నేటితో ముగియనుంది.

బాక్సాఫీస్ షేక్ చేసిన కల్కి

కాగా.. ప్రభాస్‌- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ జూన్‌ 27న  ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో కీర్తి సురేశ్‌ వాయిస్‌తో ఉన్న బుజ్జికారు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)