Breaking News

ఫ్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. మొదలైన కల్కి

Published on Tue, 02/24/2026 - 06:40

ప్రభాస్‌- దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్‌ మొదలైంది.

‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్‌లో  అమితాబ్‌ బచ్చన్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లిలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్‌లో ఆయనపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మార్చి మొదటివారంలో ప్రభాస్‌ కూడా ఈ చిత్రీకరణలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం. అయితే, కమల్‌హాసన్‌ మార్చి తర్వాత సెట్‌లోకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఇక్కడ దాదాపు నెల రోజుల పాటు రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌  కర్ణ, భైరవ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అశ్వత్థామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ నటిస్తున్నారు. అయితే, పార్ట్‌-1లో దీపిక పదుకొణె చేసిన సుమతి పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రకటన రావాల్సి ఉంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)