Breaking News

'బాహుబలి'కి కట్టప్ప.. 'కల్కి'లో మాత్రం ఏకంగా రెండు

Published on Fri, 06/28/2024 - 10:24

ప్రభాస్ 'కల్కి' థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది. కొన్నిచోట్ల మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓవరాల్‌గా థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ అని చాలామంది అంటున్నారు. 3 గంటల నిడివితో 'కల్కి'ని తెరకెక్కించినప్పటికీ కొన్ని ప్రశ్నలని అలానే వదిలేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్లు ఇందులోను ఓ రెండు సందేహాలు అలానే ఉండిపోయాయి. ఇంతకీ అవేంటి? స్పాయిలర్స్ చెప్పకుండా కాస్త డిస్కస్ చేసుకుందాం.

'బాహుబలి' తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ ఉద్ధృతమైంది. ఎంతలా అంటే చాలామంది టాలీవుడ్ దర్శకులు తమ తమ సినిమాల్ని రెండు పార్టులుగా తీస్తున్నామని.. ఆయా చిత్రాల చివర్లో హింట్ ఇచ్చారు. కాకపోతే ఇవేవి కూడా 'బాహుబలి' రేంజులో ఆసక్తిని కలిగించలేకపోయాయి. కానీ 'కల్కి'కి మాత్రం ఇది బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)

'కల్కి' చూసిన చాలామంది సినిమా సూపర్ ఉందని అంటున్నారు. కానీ ఇందులో కల్కి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటే చెప్పలేరు. మూవీలో దీపికా పదుకొణె పాత్ర సుమతి గర్భంతో ఉండగా, ఈమె కడుపులో దైవంశ ఉన్నట్లు చూపించారు. దీనిబట్టి చూస్తే ఈమెకు పుట్టే బిడ్డనే 'కల్కి'. కాకపోతే ఈ పాత్రలో ప్రభాస్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే మహాభారతం సీన్లలో భాగంగా 'కల్కి' క్లైమాక్ల్‌లో కీలక పాత్రలో ప్రభాస్ కనిపించాడు. మరి కల్కిగా కూడా ప్రభాసే కనిపిస్తాడా వేరే ఎవరానా ఉంటారా అనేది పార్ట్ 2 వస్తే గానీ తెలియదు.

ఇకపోతే 'కల్కి'లో కమల్ హాసన్ సుప్రీం యాష్కిన్ అనే విలన్‪‌గా చేశాడు. కాంప్లెక్స్‌ ప్రపంచంలో ఇతడు మహిళలకు గర్భం తెప్పించి ప్రాజెక్ట్-కె అనే ఓ మిషన్ నిర్వహిస్తుంటాడు. అసలు ఇదంటే ఏంటి? ఎందుకు చేస్తున్నాడనేది కూడా సరిగా ఎష్టాబ్లిష్ చేయకుండానే 'కల్కి' చిత్రాన్ని ముగించారు. బహుశా ఈ రెండింటికి సమాధానాలు.. 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చే తర్వాత భాగంలో రివీల్ చేస్తారేమో? 'బాహుబలి'లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక్కటే ప్రశ్న. 'కల్కి'లో మాత్రం రెండు సందేహాలు ఆలోచనలో పడేశాయ్.

(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)