Breaking News

కల్కి దెబ్బకు 'షారుఖ్‌ ఖాన్‌' రికార్డ్‌ బద్దలైంది

Published on Tue, 07/02/2024 - 08:22

ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. తాజాగా విడుదలైన సినిమాకు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. తొలిరోజు ఏకంగా రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, వీకెండ్‌లో రూ. 555 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే అనేక రికార్డ్స్‌ను కల్కి క్రియేట్‌ చేస్తుంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ ఇండియన్ సినిమాగా కల్కిని తెరకెక్కించారు. ప్రభాస్, దీపికా పదుకొణె,శోభన, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌ కల్కి మూవీలో నటించి మెప్పించారు.  జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డ్స్‌ను దాటేసింది. ఒక వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా 'కల్కి  2898 ఏడీ' ఉంది. షారుక్‌ఖాన్‌- అట్లీ 'జవాన్‌' (రూ.520 కోట్లు) పేరుతో ఉన్న రికార్డు ప్రభాస్‌ దెబ్బకు బద్దలైంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారత్‌ చిత్రంగా  హనుమాన్‌ (రూ.350 కోట్లు) ఉంది. 

అయితే, ఆ రికార్డ్‌ను కల్కి కేవలం రెండు రోజుల్లోనే బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన ఇండియన్‌ టాప్‌-3 చిత్రాల జాబితాలో 'కల్కి' మూడో స్థానంలో ఉంది.  ఆర్‌ఆర్‌ఆర్‌ (రూ.223 కోట్లు), బాహుబలి2 (రూ.217 కోట్లు), కల్కి  (రూ.191.5కోట్లు) ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇందులో రెండు ప్రభాస్‌ సినిమాలే ఉండటం విశేషం.

బాలీవుడ్‌లో పెరుగుతున్న కలెక్షన్స్‌
కల్కి సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో బాలీవుడ్‌లో కలెక్షన్స్‌ రోజురోజుకు పెరుగుతున్నాయి. వీకెండ్‌ తర్వాత సోమవారం కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీగానే రాబట్టింది. సోమవారం నాడు తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్‌ను కల్కి రాబట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌లో రూ. 170 కోట్లకు పైగానే గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి దూసుకుపోతుంది. బాలీవుడ్‌ బయర్ల నుంచి కల్కి చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. దీంతో కల్కి సులభంగానే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)