Breaking News

'రక్తపాతం, అశ్లీలత లేకుండా హిట్‌ కొట్టాం'.. సందీప్‌పై సెటైర్స్‌?

Published on Sun, 07/14/2024 - 15:45

చిన్న చిత్రమైనా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అయినా.. కంటెంట్‌ బాగుంటేనే థియేటర్‌కు వస్తామంటున్నారు ఆడియన్స్‌. లేదంటే మాత్రం చూసేదేలేదని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో 'హనుమాన్‌' వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా 'బడే మియా చోటే మియా' వంటి భారీ బడ్జెట్‌ సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌గా మిగిలిపోయాయి.

చాలా పెద్ద విషయం
ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఇంత గొప్ప కలెక్షన్స్‌ అందుకుని ఈ మైలురాయిని చేరుకోవడం మా యంగ్‌ టీమ్‌కు చాలా పెద్ద విషయం. 

సందీప్‌పై సెటైర్స్‌?
అయితే విధ్వంసం, అరాచకం, రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్‌ చేసిన నటీనటులకు, సినీ ప్రేక్షకులకు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ పెట్టాడు. దానికి రేపటికోసం అన్న హ్యాష్‌ట్యాగ్‌ జత చేశాడు. ఇది చూసిన కొందరు.. యానిమల్‌ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాను టార్గెట్‌ చేస్తూ పై కామెంట్స్‌ చేశాడా? అని నాగ్‌ అశ్విన్‌ను అనుమానిస్తున్నారు. 

పోలిక అవసరమా?
సందీప్‌ తన సినిమాలను కొత్తగా ట్రై చేస్తున్నాడు. అతడిని కించపర్చాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్‌ వారికుంటుంది. పక్కవారిని ఎందుకు అనడం? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కల్కి ఆల్‌రెడీ యానిమల్‌ సినిమా కలెక్షన్స్‌ దాటేసింది. నాగ్‌ అశ్విన్‌.. ఆ సినిమా డైరెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. ఏదో సాధారణంగా చెప్పాడంతే! అని నాగిని వెనకేసుకొస్తున్నారు.

 

 

చదవండి: బిగ్‌బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్‌.. వీడియో వైరల్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)