Breaking News

సైకో కిల్లర్‌ 'కలాం కావల్‌' మూవీ రివ్యూ..

Published on Sun, 01/18/2026 - 08:57

కొన్ని సినిమాలు పలాన నటుడు మాత్రమే చేయగలడని ప్రేక్షకులు అంటుంటారు. మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి సినిమా ఎంపికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన ఎలాంటి మూవీ తీసిన సరే మరో నటుడుని ఆ పాత్రలో ఊహించుకోలేము. మమ్ముట్టి కెరీర్‌లో 400కి పైగా సినిమాలు చేసి, హీరో, విలన్, గ్రే షేడ్స్, బయోపిక్ పాత్రలు అన్నింటినీ సమర్థంగా పోషించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటించిన 'కలాం కావల్‌' ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతుంది. నిజ జీవిత సీరియల్ కిల్లర్ సయనైడ్ మోహన్ కేసు ఆధారంగా ఈ మూవీని దర్శకుడు జితిన్‌ కె.జోస్‌  తెరకెక్కించారు. ఈ సినిమాను చూడటం మొదలుపెడితే.. పూర్తి అయ్యేవరకు ఎవరూ ఆపరు.  కథ ప్రారంభంలోనే హత్యలు చేసేది ఎవరు అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. కానీ.. పోలీసులకు తెలియదు. అయినప్పటికీ చాలా ఆసక్తిగా మూవీని నిర్మించారు.

సైకో కిల్లర్‌ ఎలా ఉంటాడు.. వరుస హత్యలు ఎందుకు చేస్తాడు అనేది 'కలాం కావల్‌'లో చక్కగా చూపించాడు. ఒకరికి దోమను చంపితే సంతోషం.. మరోకరికి కోడిని కోసినప్పుడు అది  గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు చూడటం సంతృప్తి. పాములో విషం ఉంటుందని తెలిసినా కూడా దానిని చంపే వరకు కొందరు ఊరుకోరు. ఇలా మన చుట్టూ ఉండే ప్రాణులను చంపడంలో కొందరిలో కనిపించే సంతోషం ఒక్కో స్థాయిలో ఉంటుంది. అయితే, కలాం కావల్‌ మూవీలో స్టాన్లీ దాస్‌ (మమ్ముట్టి)కి మాత్రం ఒంటరి మహిళలను చంపి సంతోషం పొందుతుంటాడు. వారిని ట్రాప్‌ చేసి తన కోరిక తీర్చుకుని చాలా సింపుల్‌గా చంపేస్తాడు. సినిమా ప్రారంభం నుంచే మొదలైన ఈ పరంపర.. చివరి వరకు కొనసాగుతుంది.  ఎక్కడా కూడా బోర్‌ కొట్టకుండా దర్శకుడు జితిన్‌ కె.జోస్‌ మెప్పించాడు.

స్టాన్లీ దాస్‌ (మమ్ముట్టి)  ఒంటరిగా ఉండే మహిళలను ట్రాప్‌ చేసి తన వలలో వేసుకుంటాడు. జీవితంలో విసిగిపోయిన వారికి కొత్త లైఫ్‌ ఇస్తానని పెళ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు వారితో గడిపి అదే రోజున హత్య చేస్తాడు. అయితే, ఒకరి ఫిర్యాదు వల్ల కథలో మలుపు తిరుగుతుంది. దీంతో ఈ కేసులోకి ఎస్సై జయకృష్ణన్‌ (వినాయకన్‌) ఎంట్రీ ఇస్తాడు. పోలీసులు ఎంత వేగంగా కేసును ధర్యాప్తు చేస్తున్నారో అంతే స్పీడ్‌గా స్టాన్లీ దాస్‌ ఆలోచన తీరు ఉంటుంది. అయితే, చాలా కూల్‌గా హత్యలు చేస్తాడు. అయితే, స్టాన్లీదాస్‌ ఎందుకు ఒంటరి మహిళలనే టార్గెట్‌ చేసి చంపేస్తున్నాడు..  కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతం వారినే ట్రాప్‌ చేయడానికి కారణం ఏంటి..? వరుసగా హత్యలు చేస్తూ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు..? ఫైనల్‌గా ఎస్సై జయకృష్ణన్‌ కేసును క్లోజ్‌ చేశాడా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

'కలాం కావల్‌' కథ 2000 సంవత్సరంలో జరిగినట్లు దర్శకుడు చూపుతాడు. దీంతో ఎక్కడా లాజిక్‌ మిస్‌ కాదు. నేటి తరం మాదిరి సీసీ కెమెరాలు వంటివి ఆరోజుల్లో లేవు. మొబైల్స్‌ కనెక్టివిటీ కూడా అప్పుడప్పుడే వినియోగంలోకి మొదలయ్యాయి. దీంతో సినిమాపై సానుకూలత కలిగేలా సీన్లు ఉంటాయి. మూవీ ప్రారంభంలోనే స్టాన్లీదాస్‌  ఒక మహిళను లోబరుచుకుని హత్య చేసే సీన్‌ ఉంటుంది. హంతకుడు ఎలాంటి వాడు అనేది అక్కడే ప్రేక్షకుడికి అర్థమయిపోతుంది. స్టాన్లీ చేస్తున్న హత్యలు వరుసగా జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో జయకృష్ణన్‌ ఇన్వెస్టిగేషన్‌ కొనసాగుతూనే ఉంటుంది. టెక్నాలజీ లేని కాలంలో ఇలాంటి కేసులను పోలీసులు ఎలా చేధించేవారో చక్కగా చూపించారు.

స్టాన్లీ దాస్‌ (మమ్ముట్టి) హంతకుడు మాత్రమే కాదు... ఇంటర్వెల్‌లో తన అసలు రూపం ఏంటి అనేది ఒక ట్విస్ట్‌తో దర్శకుడు షాకిచ్చాడు.  జయకృష్ణన్‌తోనే ఉంటూ పోలీసుల ప్లాన్స్‌ ఏంటి అనేది తెలుసుకుని చాలా తెలివిగా తప్పించుకుంటాడు. పోలీసులు రెండు అడుగులు వేస్తే.. స్టాన్లీ పది అడుగులు వేస్తాడు. అయితే, ఫైనల్‌గా స్టాన్లీనే ఈ హత్యలకు కారణం అని జయకృష్ణన్‌ కనుగునే సీన్‌ మూవీకే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వరుస ట్విస్ట్‌లతో సాగే ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో సైకో కిల్లర్‌ స్టాన్లీగా మమ్ముట్టి అదరగొట్టేశాడు. ‘జైలర్‌’లో వర్మగా తన నటనతో మెప్పించిన వినాయకన్‌ ఈ మూవీలో మరోస్థాయిలో గుర్తుండిపోయేలా నటించాడు. సోనీ లివ్‌లో ఈ మూవీని కుటుంబంతో పాటుగా చూడొచ్చు. ఎలాంటి అసభ్యత లేదు. వరుస హత్యలు ఉన్నా రక్తపు మరకలు కనిపించకుండా దర్శకుడు తెరకెక్కించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)