Breaking News

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published on Fri, 01/09/2026 - 21:17

ఓటీటీలోకి మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా 'కాలమ్‌కావల్‌' రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. డిసెంబరు 5న  థియేటర్లలో రిలీజై హిట్ అయింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.

మలయాళ బ్లాక్‌ బస్టర్‌ సినిమా 'కాలమ్‌కావల్‌' జనవరి 16న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీలో విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జితిన్‌ కె.జోసే దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. 2025లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన జాబితాలో ఈ చిత్రం టాప్‌-5లో ఉంది.

'కాలమ్‌కావల్‌' విషయానికొస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కేరళ - తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో మహిళలు వరుసగా హత్యలకు గురౌతుంటారు. ఒకప్పుడు సంచలనంగా మారిన ఈ కేసు సినిమాతో మరోసారి వెలుగులోకి వచ్చింది. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్‌గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్‌గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్‌ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)