Breaking News

తండ్రి లేకపోయినా ఆయన కల నెరవేర్చిన కూతురు

Published on Fri, 03/06/2026 - 16:11

పిల్లలు ప్రయోజకులైతే చూడాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు. కానీ ఆ ఆశ తీరకముందే తనువు చాలించాడు కళాభవన్‌ మణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2016 మార్చి 6న మరణించాడు. తండ్రి లేకపోయినా ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూతురు శ్రీలక్ష్మి. తనను డాక్టర్‌గా చూడాలన్న తండ్రి కలను నిజం చేసింది.

తండ్రి కల సాకారం
ఈ విషయాన్ని కళాభవన్‌ మణి సోదరుడు, డాక్టర్‌ ఆర్‌ఎల్‌వీ. రామకృష్ణన్‌ వెల్లడించాడు. మణి ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఆమెను పేదలకు వైద్యం చేసే డాక్టర్‌గా చూడాలని మణి ఎన్నో కలలు కన్నాడు. అతడు కోరుకున్నట్లే తను వైద్యురాలయింది. తన కుమార్తెను డాక్టర్‌ చేయాలని, పేదలకు ఉచిత చికిత్స అందించే ఆస్పత్రి ప్రారంభించాలన్నది మణి ఆశయం.

డాక్టర్‌ విద్య పూర్తి
ఈ విషయాన్ని తనెప్పుడూ బయటకు చెప్తూ ఉండేవాడు. తండ్రి మరణించిన బాధలోనే శ్రీలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసింది. అయినా తనకు మంచి మార్కులొచ్చాయి. కాలేజీలోనూ అద్భుతమైన మార్కులు సాధించింది. డాక్టర్‌ కోర్సులో చేరేందుకు రెండేళ్ల శిక్షణ తీసుకుంది. అలా MBBSలో సీటు సంపాదించుకుంది. కూతురి కోసం నిమ్మి (కళాభవన్‌ భార్య) కూడా కాలేజీ దగ్గర్లో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని అక్కడే నివసించింది అని పేర్కొన్నాడు.

ఆటో నడిపి సినిమాల్లో..
కళాభవన్‌ మణి మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టాడు. బతుకు బండి ముందుకు సాగడం కోసం ఆటో నడిపాడు. కెప్టెన్‌ ప్రభాకరన్‌ అనే తమిళ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేశాడు. 1996లో వచ్చిన సల్లప్పం అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్‌గా అనేక సినిమాలు చేశాడు. ఆ తర్వాత సహాయక పాత్రలు చేశాడు.

తెలుగు సినిమా
వాసంతియుమ్‌ లక్ష్మియుం పిన్నె నిజానుం సినిమాలో అంధ సింగర్‌గా నటించగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కామెడీ, సహాయక పాత్రలకే పరిమితం కాకుండా విలన్‌గా ట్రై చేశాడు. తెలుగులో జెమిని, అర్జున్‌, ఆయుధం, నరసింహుడు, ఎవడైతే నాకేంటి, నగరం.. ఇలా అనేక సినిమాలు చేశాడు. ప్లే బ్యాక్‌ సింగర్‌గానూ టాలెంట్‌ చూపించాడు. నటుడిగా దాదాపు 200 సినిమాలు చేసిన ఆయన అతిగా మద్యం తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు.

చదవండి: డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసిన నయనతార దంపతులు

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)