Breaking News

రెండో పెళ్లి చేసుకోమని మీనాకు సలహా.. నటి ఏమందంటే?

Published on Sun, 09/17/2023 - 11:24

సినిమా ఇండస్ట్రీలో కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్లిపోతుందంటారు. హీరోయిన్లు మారుతుంటారు, కానీ హీరోలు మాత్రం దాదాపు అలాగే ఉండిపోతారు. కానీ కొందరు హీరోయిన్లు వారి క్రేజ్‌ను కాపాడుకుంటూ పరిశ్రమలో ఏళ్లకు ఏళ్లు నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో మీనా  ఒకరు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మీనా స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. స్టార్‌ హీరోలతో ఆడిపాడిన ఈమె ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

కుంగిపోయిన మీనా
కెరీర్‌ పీక్స్‌లో ఉండగా మీనా 2009లో బెంగళూరుకు చెందిన బిజినెస్‌మెన్‌ విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరికి నైనిక అనే కూతురు జన్మించింది. అటు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సంతోషంగా సాగిపోతున్న మీనా జీవితం గతేడాది ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. గత సంవత్సరం జూన్‌లో ఆమె భర్త విద్యాసాగర్‌ మరణించడంతో తీవ్రంగా కుంగిపోయింది. నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుని సినిమాలతో బిజీ అవుతున్న తరుణంలో మీనా రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ అవి ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.

అప్పుడు మీనా దగ్గరే ఉన్నా
తాజాగా ఈ వ్యవహారంపై మీనా స్నేహితురాలు కాలా మాస్టర్‌ స్పందించింది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాకు మీనాతోనే కాదు, ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది. మేము ఫ్రెండ్స్‌గా కంటే కూడా అక్కాచెల్లెలిగానే ఎక్కువ కలిసిపోయాం. తనకు ఏ అవసరం వచ్చినా వెంటనే నేను అక్కడ వాలిపోతాను. విద్యాసాగర్‌ ఆరోగ్యం బాలేనప్పుడు మూడు నెలలపాటు నేను తన దగ్గరే ఉన్నాను. కానీ జరగకూడనిది జరిగిపోయింది.

ఆ బాధ నుంచి బయటకు రావడానికి..
తను ఎప్పుడైనా ఉన్నట్లుండి ఫోన్‌ చేసినా కూడా భయమేసేది. ఆ మూడు నెలలు ముళ్ల మీదే ఉన్నట్లనిపించింది. మీనా భర్త మరణించాక ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. జీవితం ఇంకా చాలా ఉంది, ఆ బాధ నుంచి బయటకు రావాలని ఏవేవో చెప్పేదాన్ని. తను కూడా నేను చెప్పేది కరెక్టేనని తలూపుతూనే ఈ విషాదం నుంచి బయటకు రావడం ఎంత కష్టంగా ఉందో మాటల్లో చెప్పలేనని బాధపడేది.

పెళ్లి ప్రస్తావన తెస్తే కోప్పడేవారు
తర్వాత నెమ్మదిగా తను ఒప్పుకున్న సినిమాల కోసం సెట్స్‌కు రావడం మొదలుపెట్టింది. అప్పుడు తనతోపాటు నేను కూడా తిరిగి మామూలు మనుషులమయ్యాం. మీనా తల్లి గురించి తలుచుకుంటేనే బాధేసేది. మీనాది మరీ అంత పెద్ద వయసు కాదు కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ వాళ్లు నాతో గొడవపడేవారు. ముందు నీ పని నువ్వు చూసుకో లేదంటే సైలెంట్‌గా ఉండు అని నా నోరు మూయించేవాళ్లు. తనకు కూతురు ఉందని, అంతకుమించి ఎటువంటి రిలేషన్స్‌ కోరుకోవడం లేదని మీనా నాతో అంది' అని చెప్పుకొచ్చింది ఆమె స్నేహితురాలు.

చదవండి: పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్‌ ఇదే!

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)