Breaking News

బిజీ బిజీ

Published on Sun, 01/12/2025 - 02:59

‘ది ఇండియా స్టోరీ’లో భాగం అయ్యారు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. శ్రేయాస్‌ తల్పాడే హీరోగా చేతన్‌ డీకే దర్శకత్వంలో ‘ది ఇండియా స్టోరీ’ అనే మూవీ రానుంది. ఈ చిత్రంలోనే హీరోయిన్‌గా నటించనున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ముంబై షెడ్యూల్‌లోనే కాజల్‌ అగర్వాల్‌ కూడా పాల్గొంటున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. ‘‘ఓ పవర్‌ఫుల్‌ స్టోరీ... ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి కథ చెప్పలేదు’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో జరుగుతున్న మోసాలు, పురుగుల మందులు అమ్మే సంస్థల మోసాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘సికందర్‌’లో కాజల్‌ అగర్వాల్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్‌. ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

అలాగే కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటికే పూర్తి  చేసిన హిందీ మూవీ ‘ఉమ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకా కమల్‌హాసన్‌ హీరోగా చేసిన ‘ఇండియన్‌ 3’ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్‌కు ముస్తాబు అవుతోంది. ఇలా ఈ ఏడాది బిజీ బిజీగా ఉండటంతో పాటు వరుస సినిమాల రిలీజ్‌లతో కాజల్‌ వెండితెరపై సందడి చేస్తారనుకోవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)