Breaking News

నా కెరీర్‌లో ఇదో కొత్త ప్రయత్నం: కాజల్‌ అగర్వాల్‌

Published on Fri, 05/31/2024 - 03:33

‘‘సత్యభామ’ కంటే ముందు నాకు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌కి చాన్స్‌ వచ్చింది. కానీ ఈ తరహా సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలనుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా ‘సత్యభామ’ చేశాను. లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను. బాధ్యతగా తీసుకుంటాను. ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ‘సత్యభామ’తో నెరవేరింది’’ అని కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు.

‘మేజర్‌’ చిత్రదర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే అందించారు. సుమన్‌ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ– ‘‘సత్యభామ’ సినిమాతో ఓ కొత్త ప్రయత్నం చేశాను. ఫస్ట్‌ టైమ్‌ నా కెరీర్‌లో భారీ స్టంట్స్‌ చేసిన సినిమా ఇది. వాటి కోసం చాలా కష్టపడ్డాను. క్రిమినల్స్‌ గేమింగ్, వర్చ్యువల్‌ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్‌ అధికారిని అడిగి తెలుసుకున్నాను.

ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సత్యభామ’ పూర్తిగా హైదరాబాద్‌ బేస్డ్‌ కథ. అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్‌గా విడుదల చేసి, ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం’’ అన్నారు శశికిరణ్‌ తిక్క. ‘‘ప్రతి పోలీసాఫీసర్‌ జర్నీలో ఓ స్పెషల్‌ కేసు ఉంటుంది. అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రకథ’’ అన్నారు సుమన్‌ చిక్కాల. ‘‘సత్యభామ’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత బాబీ. ఈ చిత్ర సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల మాట్లాడారు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)