Breaking News

మంచి క్వాలిటీతో రీ రిలీజ్‌ చేస్తున్నాం

Published on Thu, 11/20/2025 - 05:53

చిరంజీవి హీరోగా, రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కొదమసింహం’. కె. మురళీమోహన రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం 1990 ఆగస్టు 9న విడుదలై, ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాని 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్‌ సౌండింగ్‌తో ఈ నెల 21న రీ రిలీజ్‌ చేస్తున్నారు.

 ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీమియర్‌ షో ఏర్పాటు చేసి, నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో కైకాల నాగేశ్వర రావు మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఒకవైపు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తూనే మరోవైపు ‘కొదమసింహం’ చేశారు. ఈ సినిమాని మంచి క్వాలిటీతో రీ రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కొదమసింహం’ అప్పట్లో ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మీకు తెలుసు. రీ రిలీజ్‌ను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అని మురళీమోహన్‌ రావు తెలిపారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్‌ మాట్లాడారు.  

ఆ క్యాసెట్‌ పెడితేనే చరణ్‌ భోజనం చేసేవాడు: చిరంజీవి 
వీడియో ద్వారా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కొదమసింహం’ నా ఫేవరెట్‌ మూవీ. నాకంటే రామ్‌చరణ్‌కి ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్‌ పెడితేనే భోజనం చేసేవాడు. కృష్ణగారు చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ పెద్ద హిట్‌ అయింది. అలాంటి కౌబాయ్‌ సినిమా మళ్లీ చేయడం సాహసమే అవుతుంది. అయితే నాగేశ్వరరావు గారు, మురళీమోహన్‌ రావు వచ్చి నాకు ‘కొదమసింహం’ కథ చెప్పగానే వెంటనే అంగీకారం తెలిపాను. ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్‌ మోహన్‌బాబు గారు చేసిన సుడిగాలి క్యారెక్టర్‌. ఆయన కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి, మెప్పించి ఉండేవారు కాదు’’ అని చె΄్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)