నాలుగేళ్ల లవ్‌కు బ్రేకప్‌.. సినిమాకు ఒప్పుకోరేమోనని టెన్షన్‌!

Published on Sat, 03/30/2024 - 19:42

ప్రేమలో ఉ‍న్నంతసేపు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమంటారు. బ్రేకప్‌ అయ్యాక ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం చాలా ప్రొఫెషనల్‌. సినిమా కోసం పర్సనల్‌ విషయాలను పక్కనపెట్టి కలిసిపోయారు, కేవలం సెట్స్‌లోనే! సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ఒకప్పుడు ప్రేమపక్షులన్న విషయం తెలిసిందే! అయితే సల్మాన్‌ ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు, కానీ ఏదీ సక్సెస్‌ కాలేదు. అలాగే కత్రినాతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు.

అసౌకర్యంగా ఉంటుంది
అది జరిగిన కొంతకాలానికే డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌ 'ఏక్‌ థా టైగర్‌' సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కానీ ఈ లవ్‌ బర్డ్స్‌ బ్రేకప్‌ వల్ల ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారో, లేదోనని తెగ టెన్షన్‌ పడ్డాడు. దాని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్‌ అయింది. అలాంటి సమయంలో కలిసి పని చేయాలంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.

కత్రినా అని తెలిసి కూడా
ఆయన ఒప్పుకుంటాడో, లేదోనని టెన్షన్‌ పడుతూనే తన ఇంటికి వెళ్లాం. హీరోయిన్‌గా కత్రినాను సెలక్ట్‌ చేశాం అని చెప్పాను. 5-10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత సరే చేసేద్దాం అన్నారు. మా గుండె నుంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్‌- కత్రినా నాలుగేళ్లపాటు డేటింగ్‌ చేశారు. 2009లో విడిపోయారు. తర్వాత కత్రినా రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం కూడా నిలవలేదు. వీళ్లిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నాక విక్కీ కౌశల్‌ను లవ్‌ చేసింది. 2021లో వీరు పెళ్లి చేసుకున్నారు.

చదవండి: పదేళ్ల క్రితం ఆశపడ్డాడు.. చివరికి అది నెరవేరకుండానే..

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)