Breaking News

అర్ధరాత్రి లేచి మా గురించి ఆరా తీసేవారు: విశ్వనాథ్‌ పర్సనల్‌ బాయ్‌

Published on Fri, 02/03/2023 - 15:55

కళాతపస్వి కె విశ్వనాథ్‌ గురువారం రాత్రి శివైక్యమయ్యారు. అభిమానులను పుట్టెడు దుఃఖంలో వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ పలువురు సెలబ్రిటీలు ఎమోషనల్‌ అవుతున్నారు. తాజాగా విశ్వనాథ్‌ పర్సనల్‌ బాయ్‌ కిరణ్‌ కుమార్‌ దర్శకుడి గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.

'రెండు సంవత్సరాలుగా విశ్వనాథ్‌ సార్‌ దగ్గర పని చేస్తున్నా. ఆయన మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు. మాకు ఒంట్లో బాగోలేకపోయినా వెంటనే మెడికల్‌ షాప్‌ నుంచి మెడిసిన్‌ తెప్పిస్తారు. అర్ధరాత్రిళ్లు లేచి మరీ ఎలా ఉందని అడుగుతారు. అందరితో చాలా చనువుగా ఉంటారు. కుటుంబంతో కలిసి భోజనం చేయడానికే ప్రాముఖ్యతనిస్తారు. పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తే తనకు కనిపించి వెళ్లమనేవారు. ఆయన భార్య జయ లక్ష్మి మేడమ్‌కు గుడ్‌నైట్‌ చెప్పందే విశ్వనాథ్‌ సర్‌ నిద్రపోరు. నిన్న ఉదయం నుంచే ఆయన నీరసంగా ఉన్నాడు. రాత్రిపూట చివరగా నాగేంద్ర సార్‌తో మాట్లాడారు. సార్‌ మన మధ్య లేడంటే చాలా బాధగా ఉంది' అని విచారం వ్యక్తం చేశాడు కిరణ్‌.

చదవండి: శంకరాభరణం గురించి ఈ విశేషాలు తెలుసా?

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)