Breaking News

ఓటీటీలో 'కె.విశ్వనాథ్‌' చివరి సినిమా.. 15 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్‌

Published on Mon, 06/30/2025 - 09:36

కళాతపస్వి 'కె.విశ్వనాథ్‌' దర్శకత్వం వహించిన చివరి సినిమా 'శుభప్రదం'.. 15 ఏళ్ల తర్వాత ఓటీటీలో విడుదలైంది. 2010లో విడుదలైన ఈ చిత్రంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాటలు పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ, బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు. సాగర సంగమం, శ్రుతిలయలు, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం... ఇలా ఒకదాన్ని మించి మరొకటి? సినిమాలను తెరకెక్కించిన దర్శకులు కె. విశ్వనాథ్‌.. అయితే, చాలా కాలం గ్యాప్‌ తర్వాత ఆయన 'శుభప్రదం' సినిమా కోసం మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. 

కానీ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బలహీనంగా ఉన్నాయని ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. హీరోయిన్‌ పాత్ర చాలా బలంగా ఉందని , హీరో పాత్ర అంతగా మెప్పించలేదని రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకుల హృదయాలను శుభప్రదం అస్సలు ఆకర్షించలేదని చాలామంది చెప్పారు. సుమారు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి  విశ్వనాథ్‌ చివరి సినిమా రావడంతో ఆయన అభిమానులు మాత్రం చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

'శుభప్రదం' సినిమా 'జియోహాట్‌స్టార్‌' (jiohotstar)లో సడెన్‌గా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. కె.విశ్వనాథ్‌ సుమారు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 5 సినిమాలు  జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డ్స్‌ అందుకోవడం విశేషం. అంతటి గొప్ప దర్శకుడి చివరి సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని ఓటీటీలో విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో కె. విశ్వనాథ్‌ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)