ఓటీటీలోకి ‘విశ్వదర్శనం’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

Published on Wed, 02/19/2025 - 17:22

కళా తపస్వి కె.విశ్వనాథ్‌(K Viswanath).. తెలుగు సీనీ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని పేరు ఇది. శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సిరివెన్నెల, స్వాతి ముత్యం, శుభసంకల్పం.. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలనిచ్చిన  దర్శక దిగ్గజం ఆయన. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన సినిమాలు ఎప్పుడూ మనల్ని అలరిస్తూనే ఉంటాయి.  ఇలాంటి గొప్ప దర్శకుడి జీవిత చరిత్రను వెబ్‌ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. జనార్దన మహర్షి దర్శకత్వం వహించిన ఈ డాక్యూమెంటరీకి ‘విశ్వదర్శనం’( Viswadharshanam )అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

తాజాగా ‘విశ్వదర్శనం’ ప్రోమోని విడుదల చేశారు. అందులో ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కె.విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని వివరించనున్నారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఇది రిలీజ్‌ కానున్నట్లు నిర్మాణసంస్థ వెల్లడించింది.  ‘వెండి’తెర చెప్పిన ‘బంగారు’ దర్శకుడి కథ.. అంటూ దీన్ని ప్రకటించింది.

కాగా,తెలుగు ప్రేక్షకులకు గొప్ప సందేశాత్మక చిత్రాలను అందించిన విశ్వనాథ్‌(92).. అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్‌..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)