Breaking News

కళాతపస్వి కన్నుమూసిన వార్డులోనే ఆయన భార్య కూడా..

Published on Sun, 02/26/2023 - 20:31

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణవార్త మరువకముందే ఆయన సతీమణి జయలక్ష్మి(86) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విశ్వనాథ్‌ మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆమె అప్పటి నుంచి అస్వస్థతకు లోనయ్యారు. గత కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం  సాయంత్రం 6.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

తండ్రి విశ్వనాథ్‌ కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా మరణించడం దురదృష్టకరమని కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఈ నెల 2న కె.విశ్వనాథ్‌ శివైక్యమయ్యారు. విశ్వనాథ్‌-జయలక్ష్మిలకు పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్‌, కాశీనాథుని రవీంద్రనాథ్‌ ముగ్గురు సంతానం.

చదవండి: విశ్వనాథ్‌ సతీమణి కన్నుమూత

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)