అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏంటి?: జ్యోతిక

Published on Wed, 12/13/2023 - 08:30

హీరోయిన్‌ జ్యోతిక 'వాలి' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయ్‌, అజిత్‌, సూర్య, శింబు వంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించి టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌ చిత్రంలో నటిస్తున్న సమయంలో హీరో సూర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2006లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి దేవ్‌, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబం కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ నటించడం మొదలెట్టింది. 36 వయదునిళే చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జ్యోతిక తనకు తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటోంది. కాగా ఇటీవల ఈమె ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు పేర్కొంది.

నూతన దర్శకులే మహిళా ఇతివృత్తంతో కూడిన చిత్రాలను చేస్తున్నారని, పెద్ద దర్శకులు అలాంటి చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. నిజానికి హీరోల కంటే హీరోయిన్లే 10 శాతం అధికంగా కష్టపడుతున్నారంది. అయినప్పటికీ హీరోలనే ఎక్కువగా మోస్తున్నారని అభిప్రాయపడింది. అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలని జ్యోతిక ప్రశ్నించింది.

చదవండి: ప్రియాంకని ఏడిపించేసిన బిగ్‌బాస్.. ఒక్కటైపోయిన అర్జున్-యావర్!

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)