Breaking News

రూ. 7వేల కోట్ల సినిమా.. ఓటీటీలో ఉచితంగానే స్ట్రీమింగ్‌

Published on Wed, 11/05/2025 - 10:28

హాలీవుడ్‌ సినిమా జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌ (Jurassic World Rebirth) మరో ఓటీటీలోకి  వచ్చేస్తుంది. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 7500 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 2025లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌లో కూడా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టి సత్తా చాటింది. అయితే, గత చిత్రాల ప్రభావం వల్లే ఈ కలెక్షన్స్‌ వచ్చాయని, రీబర్త్‌ పేరుతో వచ్చిన ఈ సీక్వెల్‌ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని రివ్యూలు వచ్చాయి.  ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు. గారెత్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకత్వం వహించారు.

జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌ చిత్రం ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ (amazon prime video)లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, రెంటల్‌ విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ మూవీ చూడాలంటే అదనంగా రూ. 399 చెల్లించాలని మొదట ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత దానిని రూ. 119కి తగ్గించారు. ఈ క్రమంలోనే తాజాగా జియోహాట్‌స్టార్‌ (JioHotstar)సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌ చిత్రాన్ని ఉచితంగానే చూడొచ్చని తెలిపింది. నవంబర్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని జియోహాట్‌స్టార్‌ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలను కూడా ‘జురాసిక్‌ పార్క్‌’ చిత్రాలు ఆకట్టుకున్నాయి. 2022లో వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌: డొమినియన్‌’కు సీక్వెల్‌గా   ‘జురాసిక్‌ వరల్డ్‌: రీబర్త్‌’ (Jurassic World Rebirth) పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. విజువల్స్‌తో పాటు కొన్ని థ్రిల్లింగ్‌కు గురిచేసే సీన్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదు. కథ మొత్తం సాగదీతగానే ఉంటుంది.
 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)