Breaking News

ఎన్టీఆర్ 30 క్రేజీ అప్‌ డేట్.. కొరటాల భారీ యాక్షన్ ప్లాన్!

Published on Wed, 03/15/2023 - 16:00

అమెరికాలో జరిగిన ఆస్కార్ హడావుడి ముగిసింది. ఈ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించింది. దీంతో ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ ఇకపై తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివతో చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ 30 నుంచి అప్డేట్ రావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

ఇప్పటి నుంచి ఎన్టీఆర్ ఫోకస్ ఎన్టీఆర్ 30 పైనే పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మూవీ లాంఛ్ కార్యక్రమం ఈ నెల 18న గ్రాండ్‌గా జరగనుంది. ఆ తర్వాత మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 29 నుంచి ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. పీరీయాడికల్ మూవీగా తెరకెక్కించనున్న ఈ మూవీ  సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లోనే కనిపించింది. ఆ ఫస్ట్ లుక్‌లో సముద్రం ఒడ్డున వున్న రాయిపై జాన్వీ కపూర్ కూర్చొని ఉంటుంది. అంతే కాదు ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సముద్రం సెట్ మాత్రమే కాదు... ఓ దీవి లాంటి సెట్ కూడా రెడీ చేయించారు. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ తలపడేందుకు విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్‌ కనిపంచనున్నారు. 

ఈ సినిమా ప్రారంభం రోజే కొరటాల నటీనటుల పేర్లను ప్రకటించనున్నారు. ఆచార్యతో డిజాస్టర్ డైరెక్టర్ అనిపించుకున్న కొరటాల...ఎన్టీఆర్ 30తో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

డైరెక్టర్ కొరటాల ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌నే యాక్షన్ సీక్వెన్స్‌తో ప్లాన్ చేశారట. ఈ భారీ యాక్షన్‌ ఫైట్‌ను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌  హాలీవుడ్ సినిమాలను మించిపోయేలా కంపోజ్ చేశారనే టాక్. ఈ చిత్రంలో ఈ ఫైట్ హైలెట్‌గా నిలవనుంది.

ఆర్ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే ఈ చిత్రంపై  భారీ అంచనాలున్నాయి.ఈ సినిమాలో లావుగా కనిపించేందుకు ఎన్టీఆర్ కొంచెం బరువు కూడా పెరిగాడు. కాగా.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ 30 మూవీ ఫుల్‌ యాక్షన్ మూవీ తెలియటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 

Videos

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)