Breaking News

తారకరత్నకు సాయం చేసిన జూనియర్ ఎన్టీఆర్..!

Published on Sun, 02/19/2023 - 18:20

నటుడు తారకరత్న మరణాన్ని కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారక్‌ను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.   శంకర్‌పల్లిలోని తారకరత్న నివాసానికి చేరుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆ పార్థివ దేహానికి నివాళులర్పించారు. 

నందమూరి తారకరత్న 20 ఏళ్ల వయసులోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.  ఒకే రోజు 9 సినిమాలను ప్రకటించి రికార్డు సృష్టించారు. 2002లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో సూపర్ హిట్ సాధించారాయన. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు.  ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన అమరావతి సినిమాలో విలన్‌గా మెప్పించారు. ఈ సినిమాలో ఈయన నటనకు నంది అవార్డు కూడా లభించింది. 

అయితే ఆ తర్వాత తారకరత్నకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి.  అంతే కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని తన కుటుంబానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆ సమయంలోనే చాలా ఇబ్బందులు పడ్డారట తారకరత్న. కనీసం పిల్లల అవసరాలు కూడా తీర్చలేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తారకరత్నకు నెలకు నాలుగు లక్షల రూపాయలు పంపించారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. 

అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తారకరత్న మాట్లాడుతూ.. 'ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉండడానికి కారణం ఎన్టీఆర్. నా తమ్ముడు లేకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా తమ్ముడు అండగా నిలిచాడు.' అని అన్నారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)