Breaking News

కంగ్రాట్స్‌ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్‌

Published on Thu, 08/24/2023 - 18:55

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు మన తెలుగు హీరోకు వరిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఎందరో స్టార్‌ హీరోలను వెనక్కి నెడుతూ అల్లు అర్జున్‌కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వరించింది. 68 ఏళ్లుగా ఏ హీరోకూ దక్కని అరుదైన గౌరవం బన్నీకి దక్కింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

తాజాగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ బన్నీని అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. కంగ్రాచ్యులేషన్స్‌ బావా.. పుష్ప సినిమాకుగానూ ఈ విజయం, అవార్డులు నీకు దక్కి తీరాల్సిందే అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. పార్టీ లేదా పుష్ప డైలాగ్‌ మిస్‌ చేశారు సర్‌.. అని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకుగానూ ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ఉప్పెన, బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ప్రొవైడింగ్‌ వోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ అవార్డులు ఎగరేసుకుపోయాయి. ఇంకా ఏయే సినిమాకు ఏయే అవార్డులు వచ్చాయంటే..

♦ ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ) - కింగ్‌ సాల్మన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
♦ ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్‌ రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
♦ ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ - వి.శ్రీనివాస్‌ మోహన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
♦ ఉత్తమ లిరిక్స్‌- చంద్రబోస్‌ (ధమ్‌ ధమా ధమ్‌- కొండపొలం)

♦  ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌(సాంగ్స్‌) - దేవి శ్రీప్రసాద్‌ (పుష్ప 1)
♦  ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బ్యాగ్రౌండ్‌ స్కోర్‌) - ఎమ్‌ఎమ్‌ కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
♦  ఉత్తమ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్‌ఆర్‌ఆర్‌)
♦  బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు

చదవండి: చరణ్‌, తారక్‌ను వెనక్కు నెట్టి అవార్డు కొట్టేసిన బన్నీ.. టాలీవుడ్‌కు మొత్తంగా ఎన్ని అవార్డులు వచ్చాయంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)