Breaking News

బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్‌ రివ్యూ.. ఏమన్నాడంటే

Published on Fri, 08/05/2022 - 15:10

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన తాజా చిత్రం బింబిసార నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండేళ్ల గ్యాప్‌ అనంతరం కళ్యాణ్‌ రామ్‌ నటించిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ఫస్ట్‌ షో నుంచే ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. కల్యాణ్‌ రామ్‌ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. థియేటర్లు నందమూరి ఫ్యాన్స్‌ ఈళలతో దద్దరిల్లిపోతోంది. మరోవైపు బింబిసార మూవీపై సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్‌ రామ్‌

తాజాగా ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘బింబిసార' గురించి గొప్ప విషయాలు వింటున్నా. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు అత్యుత్సహం చూపిస్తుంటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది.  ఎలా తొలిసారి సినిమా చూసినప్పుడు వచ్చే ఫీలింగ్‌లా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. అలాగే మరో ట్వీట్‌లో ‘కల్యాణ్ అన్నయ్యా... బింబిసార రాజు పాత్రలో నిన్ను మరెవరూ రీప్లేస్ చేయలేరు.

చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక?

డైరెక్టర్ వశిష్ట సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు లెజెండరీ ఎంఎం కీరవాణి బ్యాక్ బోన్’ అంటూ తారక్‌ బింబిసార టీంకు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా రోటీన్‌ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్‌ రామ్‌. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో కెథరీన్‌ థ్రేసా, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్‌ రాజ్‌, వివాన్‌ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)