Breaking News

వస్తున్నా..: వీడియో షేర్‌ చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌

Published on Sat, 04/01/2023 - 18:27

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలపై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ప్రస్తుతం చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంటే తారక్‌ కొరటాల శివతో మూవీ చేస్తున్నాడు. #NTR30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ వదిలాడు తారక్‌. వస్తున్నా.. అంటూ తాను సెట్స్‌లో అడుగుపెట్టిన వీడియోను రిలీజ్‌ చేశాడు. క్షణాల్లో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న వాయిస్‌ వింటేనే గూస్‌బంప్స్‌ వస్తున్నాయ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

కాగా ఈ చిత్రానికి హాలీవుడ్‌ నిపుణులు పని చేస్తున్న విషయం తెలిసిందే! కెన్నీ బెట్స్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా, బ్రాడ్‌ మిన్నిచ్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే మిర్చితో డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన కొరటాల శివ.. తొలి సినిమాతోనే మంచి మార్కులు పట్టేశాడు. స్వతాహాగా రైటర్‌ కావడంతో ఈ సినిమాలో డైలాగ్స్‌ కూడా తనే రాశాడు. తర్వాత మహేశ్‌బాబుతో శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్‌, చిరంజీవితో ఆచార్య సినిమాలు చేశాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)