Breaking News

ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్

Published on Sun, 04/13/2025 - 17:16

కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ చిత్రానికి ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు.ఈ మూవీలో సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నటి విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నేను, అన్న నిల్చున్నప్పుడు ఇలాంటి వేదికలపై నాన్న వచ్చి మాట్లాడేవారు. ఈ రోజు  విజయశాంతి మాట్లాడుతుంటే మా నాన్న లేరనే లోటు భర్తీ ‍అయిపోయింది. చాలామంది హీరోలు అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఏ మహిళ కూడా విజయశాంతి లాగా గొప్పదనం సాధించలేదు. తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. భారతదేశవ్యాప్తంగా హీరోలతో సమానంగా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి ఒక్కరే. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి ఎన్నో గొప్ప కథలు, పాత్రలు చేసిన మరో నటి ఇండియాలోనే లేదు. ఈ ఘనత కేవలం ఆమెకు మాత్రమే దక్కింది. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా కథ కర్తవ్యం మూవీలో వైజయంతికి ఓ కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఐడియాతోనే ఈ కథ పుట్టినట్టు ఉంది' అని విజయశాంతిపై ప్రశంసలు కురిపించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)