ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం
Breaking News
ముందుగానే అంచనా వేశారు.. ఎస్కేప్ అయ్యారు.!
Published on Sun, 03/01/2026 - 11:51
ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా జోర్డాన్ దేశంలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్,మాస్ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు.
తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్ టీమ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన టీమ్ ముందుగానే ఇండియాకొచ్చేసింది. వాస్తవానికి ఈ షెడ్యూల్ మార్చి మొదటి వరకు కొనసాగాల్సి ఉంది. కానీ కాస్తా తొందరగానే అక్కడి పరిస్థితులు అంచనా వేసిన డ్రాగన్ టీమ్ ఫిబ్రవరి 22 నాటికే షూటింగ్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. దీంతో ఈ దాడుల నుంచి ఎన్టీఆర్- నీల్ టీమ్ తృటిలో తప్పించుకుంది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు యూనిట్ సభ్యులు చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని టాలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు.
Tags : 1