Breaking News

అమెరికా వెళ్లిపోయిన ఎన్టీఆర్.. ఇక అది కష్టమే

Published on Mon, 09/23/2024 - 08:43

'దేవర' కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లిపోయాడు. లెక్క ప్రకారం హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. కానీ ఊహించిన దానికంటే అభిమానులు ఎక్కువగా వచ్చారు. 5 వేల మందికి పట్టే చోటుకి ఏకంగా 25 వేల మందికి పైగా వచ్చారు. తోపులాటని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అలానే ఇంతమందిని తట్టుకోవడం కష్టమని చెప్పి కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో తారక్‌ని కళ్లారా చూడాలనుకున్న వాళ్లకు నిరాశ తప్పలేదు.

(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)

'దేవర' ప్రీ రిలీజ్ రద్దవడంతో అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఎన‍్టీఆర్ నుంచి వీడియో వచ్చింది. 'భద్రతాపరమైన కారణాల వల్ల ఈవెంట్‌ క్యాన్సిల్‌ చేశాం. మళ్లీ చెబుతున్నాను. మీతో పాటు నేనూ బాధపడుతున్నాను. మీ కంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా' అని తారక్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

ముందు నుంచి ఉన్న ప్లాన్ ప్రకారం సోమవారం వేకువజామున అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కి ఎన్టీఆర్ బయలుదేరాడు. అక్కడ సెప్టెంబరు 26న ప్రీమియర్స్ పడతాయి. దీంతో అక్కడే జరగబోయే బియాండ్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొంటాడు. అలానే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తాడు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తాడు. దీనిబట్టి చూస్తే 'దేవర' ప్రీ రిలీజ్ ఇక లేనట్లే. అభిమాన హీరోని చూడాలనుకునే ఫ్యాన్స్‌కి ఇది ఓ రకంగా బ్యాడ్ న్యూసే.

(ఇదీ చదవండి: 'దేవర' కోసం జాన్వీ.. తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందో)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)