Breaking News

సరికొత్త మాస్‌ లుక్‌లో...

Published on Fri, 02/21/2025 - 06:16

‘ఆర్‌ఆర్‌ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్‌’ వంటి విజయాల తర్వాత డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే పాన్‌ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లోప్రారంభమైంది.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించి, లొకేషన్‌లోని ఓ ఫొటోని షేర్‌ చేసింది. ‘‘మాస్‌ హీరో, మాస్‌ డైరెక్టర్‌ ఇమేజ్‌ ఉన్న స్టార్స్‌ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్‌ నీల్‌’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. మూడువేల మంది జూనియర్‌ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణతో షూటింగ్‌ ఆరంభించాం.

తర్వాతి షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇప్పటివరకు చూడనటువంటి మాస్‌ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు ప్రశాంత్‌ నీల్‌. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనున్నాం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: భువన్‌ గౌడ, సంగీతం: రవి బస్రూర్‌.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)