Breaking News

డ్రాగన్‌... మళ్లీ యాక్షన్‌!

Published on Wed, 03/11/2026 - 00:17

మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లి పోయాడు డ్రాగన్‌. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్, మలయాళ నటుడు టోవినో థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్‌ జోర్డాన్‌లో ముగిసింది. ఎన్టీఆర్, టోవినో థామస్‌ పాల్గొనగా కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది.

కొత్త షెడ్యూల్‌ ఈ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్‌ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం మూడు పెద్ద సెట్స్‌ను క్రియేట్‌ చేశారని, ఇందులో విలన్‌ ఇంటి సెట్‌ కూడా ఉందని, ఈ సెట్స్‌లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలవుతుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌ దాదాపు నెల రోజులకు పైనే ఉంటుందని సమాచారం. ఇక్కడ షూట్‌ పూర్తి చేసిన తర్వాత ‘డ్రాగన్‌’ టీమ్‌ శ్రీలంక వెళ్లనుందనే టాక్‌ వినిపిస్తోంది. నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్‌.
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)