Breaking News

కోలీవుడ్‌లో నా ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఆయనే: జూనియర్ ఎన్టీఆర్‌ కామెంట్స్‌

Published on Tue, 09/17/2024 - 21:10

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా చెన్నైలో దేవర టీమ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈవెంట్‌కు హజరైన జూనియర్ ఎన్టీఆర్‌ దేవర గురించి పలు ఆసక్తికర విషయానలు పంచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. చెన్నై నాకెప్పుడు ప్రత్యేకమే. నా చిన్నప్పుడు కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నా దేవర కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మేము అనుకున్న దాన్ని ఫర్‌ఫెక్ట్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం మేమంతా స్ట్రాంగ్‌ పిల్లర్స్‌లా నిలబడి పనిచేశాం. డైరెక్టర్‌ విజన్‌కు అనుగుణంగా నడుచుకున్నాం. దేవర కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను. ఆ చిత్రం అందరికీ ప్రత్యేకం. ముఖ్యంగా హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన పాత్రను అద్భుతంగా చేసింది. ఆమె నటనను తెరపై చూడాల్సిందే.' అని అన్నారు. 

(ఇది చదవండి: దేవర యాక్షన్‌ సీక్వెన్స్‌.. ఆ సీన్‌కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్)

మన భాషలు వేరైనప్పటికీ.. మనందరినీ ఒక్కటిగా చేసేది సినిమా ‍అని ఎన్టీఆర్ తెలిపారు. ఇక్కడ కోలీవుడ్‌, టాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌  కాదు.. ప్రేక్షకులంతా ఒక్కటేనని బాక్సాఫీసు వద్ద ఎన్నో సినిమాలు నిరూపించాయన్నారు. తమిళంలో డైరెక్ట్‌గా సినిమా చేయండి సార్ అని యాంకర్ ప్రశ్నించగా.. నా ఫేవరెట్ డైరెక్టర్‌ వెట్రిమారన్ సర్‌.. తమిళంలో ఓ సినిమా ప్లాన్ చేయండి.. తెలుగులో డబ్‌ చేసుకుంటాం.. అంటూ ఎన్టీఆర్‌ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను దేవర టీమ్‌ ట్విటర్‌లో షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)