Breaking News

టాలీవుడ్‌లో గాయాల కలకలం. . ఆస్పత్రి బాట పడుతున్న అగ్ర హీరోలు!

Published on Tue, 07/28/2026 - 14:24

టాలీవుడ్‌లో అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్న ఘటనలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల నందమూరి బాలకృష్ణకు గాయం కాగా.. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ భుజానికి గాయమైంది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా చేతికి కట్టుతో కనిపించారు. ఈ మధ్యే  పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌ కూడా షూటింగ్‌ల సమయంలో గాయాల పాలై, సర్జరీలు చేయించుకున్నారు. దీంతో తెలుగు హీరోలకు గాయాలు, వాటి ప్రభావం సినిమాలపై ఎలా ఉంటుందనే అంశంపై చర్చ  ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిగా మారింది.

మొన్న బాబాయ్‌.. నేడు అబ్బాయి
ఇటీవల తన కొత్త చిత్రం ('NBK111') షూటింగ్ కాకినాడ పోర్టులో జరుగుతుండగా, ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో బాలయ్యకు మోకాలికి గాయమైంది. కండరాల కణజాలం దెబ్బతినడంతో, ఆయనకు హైదరాబాద్‌లో చిన్నపాటి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఆయన నటిస్తున్న 'డ్రాగన్' (Dragon) సినిమా షూటింగ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వైద్యులు ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

మెగా హీరోలకు వరుస గాయాలు
మెగాస్టార్ చిరంజీవి గతంలో చేతికి సర్జరీ చేయించుకోవడంతో కట్టుతో కనిపించారు. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆయన చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకుని కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు (గతంలో 2021లో కూడా ఆయన కుడిచేతికి నరాల సమస్యతో సర్జరీ చేయించుకున్నారు). ఇక తాజాగా రామ్‌ చరణ్‌ కూడా తన మణికట్టుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. 

‘పెద్ది’షూటింగ్‌ సమయంలోనే చరణ్‌కి గాయాలయ్యాయి. ఇక మరో మెగా హీరో పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ మధ్యే తన భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ తన సినీ ప్రయాణంలో అనేక యాక్షన్‌ సన్నివేశాలను స్వయంగా చేయడం వల్ల పలు మార్లు గాయాలపాలయ్యారు. భుజం, నడుము భాగాల్లో గాయాలతో కొంతకాలం షూటింగ్‌కు దూరమైన సందర్భాలు ఉన్నాయి.

నిర్మాతల్లో ఆందోళన
స్టార్ హీరోలకు గాయాలయ్యాయనే వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్‌ మీడియాలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిర్మాతలకు మాత్రం షూటింగ్ షెడ్యూల్స్‌, విదేశీ లొకేషన్లు, భారీ సెట్లు, వందలాది మంది సిబ్బంది సమన్వయం వంటి అంశాలు సవాలుగా మారుతున్నాయి. ఒక్కరోజు షూటింగ్ వాయిదా పడినా కోట్ల రూపాయల అదనపు వ్యయం వచ్చే పరిస్థితి ఉంటుంది. 

సాధారణంగా స్వల్ప గాయాలైతే కొన్ని రోజుల విశ్రాంతితో హీరోలు తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారు. అయితే గాయం తీవ్రంగా ఉంటే షూటింగ్ షెడ్యూల్‌లు ఆలస్యం కావడం, పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు వెనక్కి వెళ్లడం, చివరికి సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాన్‌ ఇండియా సినిమాల విషయంలో ముందుగానే థియేటర్ల బుకింగ్‌లు, ప్రమోషన్‌ ప్లాన్లు సిద్ధమవుతాయి. అలాంటి సమయంలో చిన్న ఆలస్యం కూడా నిర్మాతలపై ఆర్థిక భారం పెంచుతుంది.

గాయాలు ఎందుకవుతున్నాయి?
ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సత్తా చాటుతున్నాయి. దీంతో యాక్షన్‌ సన్నివేశాల స్థాయి కూడా భారీగా పెరిగింది. రియలిస్టిక్‌గా కనిపించాలనే ఉద్దేశంతో చాలా మంది స్టార్ హీరోలు డూప్‌లపై పూర్తిగా ఆధారపడకుండా స్టంట్లు స్వయంగా చేస్తున్నారు. వైర్‌ యాక్షన్‌, హైస్పీడ్‌ ఛేజ్‌లు, భారీ ఫైట్‌ సీక్వెన్స్‌లు, క్లిష్టమైన యాక్షన్‌ షాట్ల కారణంగా చిన్నచిన్న గాయాలు సాధారణమవుతున్నాయి.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)