Breaking News

అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎన్టీఆర్‌

Published on Tue, 04/29/2025 - 13:47

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా   (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఎన్టీఆర్‌ ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న  ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)  మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో  పీరియాడికల్‌ స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తుంది . ఇందులో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్‌ 22 నుంచి  షూటింగ్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన  సంగతి తెలిసిందే. ‘దేవర’ తర్వాత  ఎన్టీఆర్‌.. ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అభిమానులకు ఎన్టీఆర్‌ శుభవార్త చెప్పారు.    (#NTRNEEL) చిత్రాన్ని 2026 జూన్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డైనమిక్‌ వ్యక్తుల కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విధ్వంసమే జరగనుంది. ఆ అనుభూతి పొందేందుకు సిద్ధకండి అంటూ  మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది. వచ్చే సమ్మర్‌లో బాక్సాఫీస్‌ వద్ద ఫుల్‌ సందడి వాతావరణం కనిపించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

మొదట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే, కథ వల్ల వీఎఫ్‌ఎక్స్‌ పనులతో పాటు చిత్రీకరణ విషయంలోనూ మరింత స్ట్రాంగ్‌గా ప్లాన్‌ చేయడం వల్లే కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు కూడా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే.. తారక్‌ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్‌లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే, ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభించారు.  శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎన్టీఆర్‌తో షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఉన్నాయి. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను ఫైనల్‌ చేశారని తెలిసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)