కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
Breaking News
ఆంధ్రావాలా వస్తున్నాడు
Published on Tue, 01/13/2026 - 03:39
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలను మరోసారి రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపుతున్నారు. కొన్ని సినిమాలు రీ రిలీజ్‌లోనూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు మంచి వసూళ్లతో సత్తా చాటుతుండటం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’(Andhrawala) సినిమా రీ రిలీజ్‌కు ముస్తాబవుతోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. రక్షిత హీరోయిన్. భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 22 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా ఈ నెల 26న రీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత గిరి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ ప్రస్తుం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) షూట్‌లో పాల్గొంటున్నారు.
Tags : 1