Breaking News

రూ.2 లక్షలిస్తానన్నా జబర్దస్త్‌కు వెళ్లను: కమెడియన్‌

Published on Thu, 08/17/2023 - 15:39

నటుడు, కమెడియన్‌ జోష్‌ రవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లవుతోంది. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేశాను, కానీ ఇందులో గుర్తుపెట్టుకునేవి 20-30 మాత్రమే ఉంటాయంటున్నాడు జోష్‌ రవి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మంచి బ్రేక్‌ వచ్చింది. రవితేజ ఫోన్‌ చేసి మెచ్చుకుంటే కన్నీళ్లాగలేదు. కానీ తర్వాత అన్నీ గే క్యారెక్టర్స్‌ వచ్చాయి. అస్తమానం అవే చేస్తే బాగోదని వాటన్నింటినీ వదులుకున్నాను.

మొదట్లో చాలా కష్టాలు పడ్డాను. తిండీతిప్పలు మాని తిరిగాను. వచ్చిన అవకాశంతో నన్ను నేను నిరూపించుకున్నాను. జనాలు ఆదరించారు. నేను నటించిన మొదటి చిత్రం మగధీర. కానీ ఎక్కువ నిడివి పాత్ర జోష్‌లో ఉండటంతో జోష్‌ రవిగా నా పేరు స్థిరపడిపోయింది. నాన్నకు ప్రేమతో సినిమాలో జూ.ఎన్టీఆర్‌ ఫ్రెండ్‌గా నేను చేయాల్సింది. సుకుమార్‌గారికి ఫోటో కూడా పంపాను. కానీ ఎవరో ఎదగడం కోసం మధ్యలో ఉన్నవాళ్లు నా గురించి నెగెటివ్‌గా చెప్పి ఆ ఆఫర్‌ రాకుండా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం నాకూ, సుకుమార్‌కు కూడా తెలిసింది.

జబర్దస్త్‌ షోపై నాకు గౌరవం ఉంది. కానీ రూ.2 లక్షలు ఇస్తానన్నా నేను వెళ్లను. ఎందుకంటే నేను కేవలం సినిమాలే చేస్తాను. జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చినప్పటికీ నాలుగు సార్లు షోకి గెస్ట్‌గా వెళ్లాను. ఇప్పటికీ గెస్ట్‌గా రమ్మంటే వెళ్తాను. కానీ అక్కడే ఉండి డబ్బు సంపాదించాలనేది లేదు. ఎందుకంటే నేను 20కు పైగా సినిమాలు చేశాక జబర్దస్త్‌కు వెళ్లాను. అప్పుడు నాకు రెండు, మూడు వేలు మాత్రమే ఇచ్చేవారు. నాకు సినిమా అనేది ప్రధానం. ఇక్కడ అవకాశాలు రాకపోయినా ఖాళీగా కూర్చుంటానే తప్ప జబర్దస్త్‌ చేయను' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: విజయ్‌ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్‌ కామెంట్స్‌ వైరల్‌
శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)