Breaking News

Jigris Teaser: నవ్వులు పూయిస్తున్న ‘జిగ్రీస్‌’ టీజర్‌

Published on Wed, 08/13/2025 - 12:21

‘కొంతమంది ఉంటారు శుద్ధపూసలు. ఫస్ట్‌ వద్దేవద్దు అని షో చేస్తారు. తర్వాత కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు’ అనే డైలాగ్‌తో మొదలైంది జిగ్రీస్‌ మూవీ టీజర్‌. కృష్ణ బురుగుల, ధీరజ్‌ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు.  కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని స్టార్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశారు. ఫ్రెండ్షిప్‌, అడ్వెంచర్‌, కామెడీ నేపథ్యంలో టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది.

టీజర్‌ రిలీజ్‌ అనంతరం సందీప్‌ మాట్లాడుతూ.. ‘ కృష్ణ వోడపల్లి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నాకు చెబితే తిడతానని.. చెప్పకుండానే సినిమా స్టార్ట్‌ చేశాడు. యానిమల్‌ షూటింగ్‌ గ్యాప్‌లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కొన్ని విజువల్స్‌ చూపించాడు. చాలా బాగున్నాయి. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఈ రోజుల్లో కాన్ టెంపరరీ కామెడీ బూతులు లేకుండా చాలా బాగా రాసిండు, తీసిండు డైరెక్టర్ హరీష్. 

టీజర్‌లో చూసిన కామెడీ చాలా తక్కువే. సినిమాలో అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. కంటెంట్‌ బాగుంటే చాలు డైరెక్టర్‌, నిర్మాతలతో సంబంధం లేకుండా సినిమాను హిట్‌ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ చిన్న సినిమా కంటెంట్‌ బాగుంది. అందరూ సపోర్ట్‌ చేయండి’ అన్నారు. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)