Breaking News

ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Thu, 07/02/2026 - 21:06

ఓటీటీకి వచ్చేందుకు మరో సూపర్ హిట్ మూవీ సిద్ధమైంది. జయరామ్, ఊర్వశి నటించిన లేటేస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'పరిమళ అండ్ కో'. ఈ సినిమాకు పండిరాజ్ దర్శకత్వం వహించారు. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో సంజన కృష్ణమూర్తి,  అనంతిక సనీల్‌కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ మూవీ జూలై 10 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీలో మిస్కిన్, యోగి బాబు, శాండీ, సంతోశ్, శోభన్ కీలక పాత్రల్లో కనిపించారు.

అసలు కథేంటంటే..

ఈ చిత్రం ఒక హత్య మిస్టరీలో చిక్కుకున్న మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. వారి చిన్న కుమార్తెను వేధిస్తున్న ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతాడు. ఈ వార్త బయటకు రాగానే.. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకుంటారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు? ఆ కుటుంబానికి, గ్యాంగ్‌స్టర్‌కు మధ్య ఉన్న వైరమేంటి? అనేది తెలియాలంటే పరిమళ అండ్‌ కో మూవీ చూడాల్సిందే. ఈ స్టోరీ వింటుంటే అచ్చం దృశ్యం మూవీనే తలపిస్తోంది.  

 

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)