Breaking News

దయచేసి పిల్లలతో కలిసి సినిమా చూడకండి:స్టార్ హీరో

Published on Mon, 09/25/2023 - 20:08

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, జయం రవి జంటగా నటించిన చిత్రం ఇరైవన్. క్రైమ్‌ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని గాడ్ పేరుతో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ లాంఛ్‌లో పాల్గొన్న జయం రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు. 

(ఇది చదవండి: కలర్స్‌ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!)

జయం రవి మాట్లాడుతూ..' అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం అందించే లక్ష్యంతో సినిమాలు చేస్తున్నాం. అయితే ఇరైవన్‌ (గాడ్) చిత్రాన్ని మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దు. ఎందుకంటే సెన్సార్ బోర్డ్  ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. అంటే సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి చిన్న పిల్లలు భయపడే అవకాశం ఉంది. మా సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్‌లోనే చూపించాం. కొంతమంది ప్రేక్షకులు ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్‌ చిత్రాలను  ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నా.' అని అన్నారు. డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌  గతంలో నాకు ఓ కథ చెప్పారు. అది అనివార్య కారణాలతో చేయలేకపోయాను. అతనికి  మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. ఇకపోతే నాకు డైరెక్షన్‌ చేయాలనే ఉంది.. భవిష్యత్తులో అవకాశం వస్తే విజయ్‌ సేతుపతిని హీరోగా పెట్టి సినిమా చేస్తానని తెలిపారు. 

(ఇది చదవండి: 800 మూవీ విజయ్‌ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)