Breaking News

సైలెంట్‌ అయిన విశాల్‌, కార్తీ.. ఛాన్స్‌ పట్టేసిన జయం రవి

Published on Mon, 05/29/2023 - 09:37

సినిమాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు నటుడు జయం రవి. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషించి అందరి ప్రశంసలను అందుకున్న ఈయన ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. జయం రవి, నయనతార జంటగా నటించిన ఇరైవన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

అలాగే ప్రస్తుతం సైరన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్‌ హీరోయిన్‌. అదే విధంగా దర్శకుడు రాజేష్‌ ఎం.దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, మరో నూతన దర్శకుడి సినిమాలోనూ నటించనున్నారు. ఈ పరిస్థితుల్లో జయం రవి మరో నూతన చిత్రానికి కమిట్‌ అయినట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకు ముందు కార్తీక్‌ తగవేల్‌ దర్శకత్వంలో అడంగామరు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.

ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో భారీ చిత్రం తెరకెక్కబోతుంది. దర్శకుడు కార్తీక్‌ తంగవేల్‌ తాను రాసుకున్న కథను నటులు విశాల్‌, కార్తీలకు చెప్పి వారిలో ఒకరి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూసినట్లు, వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాకపోవడంతో మళ్లీ నటుడు జయం రవినే ఆశ్రయించినట్లు సమాచారం. జయం రవి పచ్చజెండా ఊపడంతో దర్శకుడు కార్తీక్‌ తంగవేల్‌ షూటింగ్‌కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిని ఏజీఎస్‌ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.

చదవండి: నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆ ఫోటో ఏంటి? మలైకాపై నెటిజన్స్‌ ఫైర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)