Breaking News

జయం రవి విడాకుల కేసు.. అన్ని పోస్టులు డిలీట్ చేసిన భార్య!

Published on Wed, 05/28/2025 - 15:09

కోలీవుడ్ హీరో జయం రవి ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఆయన భార్య, జయం రవి ఒకరిపై ఒకరు పెద్దఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. తనను వేధింపులకు గురి చేశారంటూ జయం రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడాకులకు దారితీసిందని ఆరోపించింది. విడాకుల విషయంలో ఇప్పటికే వీరిద్దరు కోర్టుకు కూడా హాజరవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జయం రవి భార్య ఆర్తి ఓ బిగ్ షాకిచ్చింది. ఈ వివాదం గురించి చేసిన పోస్టులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని హైకోర్టు ఆదేశించండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవి తన భార్య  ఆర్తితో పాటు అత్త సుజాతకు నోటీసులు పంపారు. తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని వారిద్దరికీ లీగల్ నోటీసు పంపారు. అంతేకాకుండా నటుడికి పరువు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పంపించారు.

అదేవిధంగా ఆర్తి సైతం.. రవి మోహన్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆర్తితో పాటు అత్త సుజాతపై పోస్టులు చేయకుండా ఆపేయాలని హైకోర‍్టు ఆదేశించింది. దీంతో ఆర్తి హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. న్యాయ వ్యవస్థ పరువు నష్టం నుంచి రక్షణ కల్పించడం.. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయాన్ని కాపాడిందని ఆమె పోస్ట్‌కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా.. జయం రవి,  ఆర్తి 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్‌ ఉన్నారు.

j
 

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)