Breaking News

గ్యాంగ్‌స్టర్‌గా నటుడు జయంరవి.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Published on Thu, 02/23/2023 - 10:07

కథల ఎంపిక విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకునే నటుడిగా జయం రవికి పేరుంది. అందుకే ఆయన కెరీర్‌లో విజయాల శాతం ఎక్కువ. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌లో టైటిల్‌ పాత్రను పోషించి శెభాష్‌ అనిపించుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. స్కీన్ర్‌ సీన్‌ సంస్థకే వరుసగా మూడు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి అఖిలన్‌ చిత్రం.

ఇందులో ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా నటి తాన్యారవిచంద్రన్‌ మరో నాయకిగా ఎంపికైంది. ఎన్‌.కల్యాణ్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఉత్తర చెన్నై నేపధ్యంలో సాగే ఇందులో జయంరవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇక శ్యామ్‌ సీఎస్‌.సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అఖిలన్‌ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

కాగా ఈ చిత్రం తరువాత జయంరవి నటుడు విక్రమ్, కార్తీ, విక్రమ్‌ ప్రభు, శరత్‌కుమార్, త్రిష, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌– 2 ఏప్రిల్‌ 28న తెరపైకి రానుంది. ఇవి కాకుండా జయం రవి ఇరైవన్, సైరన్‌ వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో నయనతారతో జత కడుతున్న ఇరైవన్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కాగా ఈయన నటించిన చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)