Breaking News

13 ఏళ్లకే సినిమాల్లోకి.. తొలి పారితోషికం రూ.10, ఎవరో గుర్తుపట్టారా?

Published on Wed, 07/12/2023 - 15:39

కాటుక కళ్లతో, ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈమె ఒక క్లాసికల్‌ డ్యాన్సర్‌.. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. గ్లామర్‌, యాక్టింగ్.. రెండింటిలోనూ బెస్ట్‌ అనిపించుకుంది. ఈపాటికే ఆమె ఎవరో తెలిసిపోయుంటుంది. అవును, ఆమె అచ్చతెలుగందం, అందాల తార జయప్రదనే!

15 ఏళ్లకే హీరోయిన్‌
రాజమండ్రికి చెందిన జయప్రద అసలు పేరు లలిత రాణి. 'భూమి కోసం' (1974) చిత్రంలో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించింది. ఈ చిత్రంలోని ఓ పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు చంద్రమ్మ మరెవరో కాదు జయప్రదనే. ఈ సినిమా చేసే సమయానికి ఆమె వయసు 13 కాగా తను అందుకున్న పారితోషికం రూ.10. ఈ చిత్రంతోనే ఆమె తన పేరు మార్చుకుని జయప్రదగా మారింది. తన పెదవిపై ఉండే పుట్టుమచ్చ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీని తర్వాత ఆమె చేసిన పెద్ద చిత్రం అంతులేని కథ. అప్పుడామె వయసు 15 ఏళ్లు. షూటింగ్‌లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు కె.బాలచందర్‌ సంతోషంతో క్లాప్స్‌ కొట్టారట!

300కు పైగా సినిమాలు..
జయప్రద 'అడవి రాముడు' సినిమాతో కమర్షియల్‌ హీరోయిన్‌గా మారింది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి.. హరి.. అంటూ ఆమె తన అందాలు చూపిస్తూ కళ్లతోనే కొంటెగా మాట్లాడింది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు అందుకున్న ఆమెకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు తలుపు తట్టాయి. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, రాకేశ్‌ రోషన్‌, జితేంద్ర వంటి బడా స్టార్స్‌తో నటించింది జయప్రద. హిందీలో జితేంద్ర- జయప్రదలది ఎక్కువ హిట్‌ కాంబినేషన్‌గా చెప్పుకుంటారు. 'సిరిసిరిమువ్వ', 'భద్రకాళి', 'అడవిరాముడు', 'యమగోల', 'అందమైన అనుభవం', 'సాగర సంగమం', 'దేవత', 'మేఘసందేశం'.. ఇవి కాక.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేసింది. ఆమె నటనా కౌశల్యానికి గానూ ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెకు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. హీరోలతో సమాన పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది.

ముగ్గురు పిల్లల తండ్రితో పెళ్లి
కెరీర్‌లో ఆకాశమంత విజయాలను చూసిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాల మేళవింపుగా మిగిలిపోయింది. జయప్రద అప్పటికే పెళ్లై, ముగ్గురు పిల్లల తండ్రైన నిర్మాత శ్రీకాంత్‌ నహతాను ప్రేమించింది. అతడు మొదటి భార్యకు విడాకులివ్వకుండానే జయప్రదను పెళ్లాడాడు. అప్పట్లో ఈ విషయం పతాక శీర్షికల్లో నిలిచింది. వీరికి పిల్లలు లేరు. పెళ్లి తర్వాత కూడా జయప్రద సినిమాలు చేసింది. కానీ నెమ్మదిగా దర్శకనిర్మాతలు తనను పక్కన పెడుతూ రావడంతో సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఆమె చివరగా 2019లో సువర్ణ సుందరి సినిమా చేసింది. చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది.

చదవండి: నా భర్తను ద్వేషిస్తున్నా.. ఎందుకంటే 5 నిమిషాలు కూడా మాట మీద నిలబడడు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)