Breaking News

అభ్యంతరకర సీన్‌.. టచ్‌ చేసినందుకు విలన్‌ను చితకబాదిన జయ

Published on Sun, 04/09/2023 - 17:53

జయా బచ్చన్‌.. ఒకప్పుడు హిందీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. అందాల ఆరబోతకు ఓ అడుగు దూరంగా ఉండే ఆమె తన సహజసిద్ధ నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకుంది. 1971లో గుడ్డి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. నేడు (ఏప్రిల్‌ 9) ఆమె పుట్టినరోజు. ఈ రోజు ఆమె 75వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జయా బచ్చన్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలను ఆమె మాటల్లోనే..

'1972లో బీఆర్‌ ఇషారా డైరెక్షన్‌లో ఏక్‌ నజర్‌ సినిమా చేశాను. ఇందులో అమితాబ్‌ హీరో. ఈ మూవీలో సుధీర్‌ అనే వ్యక్తి నాపై అత్యాచారం చేయాల్సి ఉంటుంది. నా బట్టలు చింపుకోమన్నారు. నేనేమో కుదరదు, అందుకు అంగీకరించనని తెగేసి చెప్పాను. చాలాసేవు వాదనలు జరిగాయి. నేను ఒప్పుకోకపోతే సినిమా ఆపేస్తానని డైరెక్టర్‌ హెచ్చరించాడు. నీకు నచ్చింది చేసుకోపో అన్నాను. అదే కనక జరిగితే ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తానని నిర్మాత బెదిరించాడు.

ఏదైనా చేసుకో అన్నాను, కానీ అస్సలు తగ్గలేదు. కాదూ, కూడదని బలవంతంగా నాతో ఆ సీన్‌ చేయిస్తే దాన్ని ఎలా నాశనం చేస్తానో మీరే చూస్తారని వార్నింగ్‌ ఇచ్చాను. అలా ఆరోజు షూటింగ్‌ క్యాన్సల్‌ చేశారు. రెండు రోజులదాకా షూట్‌ ఊసే ఎత్తలేదు. దీంతో అమితాబ్‌ జోక్యం చేసుకుని నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇది నీ రోల్‌.. అక్కడేం చెప్తే అది చేయాల్సిందే! చేయనని ఎలా ఎదురుతిరుగుతావు? అన్నాడు.

నాకు బట్టలు చింపుకోవడం ఇష్టం లేదు. నేనలా చిరిగిన బట్టలతో స్క్రీన్‌పై కనిపించాలనుకోవడం లేదని బదులిచ్చాను. మొత్తానికి ఎలాగోలా నేనే కొంత వెనక్కు తగ్గాను. అత్యాచార సన్నివేశంలో చాలా సహజంగా నటించమన్నారు. పాపం ఆ విలన్‌ నా దగ్గరకు రాగానే ఇష్టమొచ్చినట్లు కొట్టాను. దీంతో అతడు నేను ఈ రేప్‌ సీన్‌ చేయను అని ఏడుపుముఖం పెట్టాడు' అంటూ నవ్వుతూ ఆనాటి సంఘటనను షేర్‌ చేసుకుంది జయా బచ్చన్‌.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)